క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని కంటి మీద కునుకులేకుండా చేస్తున్న సంగ‌తి తెలిసిందే..  కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలో మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ వైర‌స్ బారిన ప‌డి ఇప్పటి వరకు అక్ష‌రాలా ల‌క్ష‌ మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మ‌హహ్మారి వైర‌స్‌ను అంతం చేసేందుకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విస్తృత ప‌రిశోద‌న‌లు జ‌రుగుతున్నాయి.  తాజాగా శాస్త్రవేత్తలు ఒక శుభవార్తను వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాక్సిన్  సెప్టెంబర్ నాటికి సిద్ధం కావచ్చని పేర్కొంటున్నారు. 

 

ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని వ్యాక్సినాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ బృందం త్వరలోనే కరోనా వైరస్ కు వ్యాక్సిన్‌ను సిద్ధం చే యనుంది. రాబోయే 15 రోజుల్లో తమ బృందం మానవులపై కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను పరీక్షిస్తుందని వారు తెలిపారు. ఈ టీకాపై 80 శాతం నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ టీకాకు సంబంధించిన పరీక్షా  ఫలితాలు సక్రమంగా ఉంటే, ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి నిధులు విడుదల చేస్తుందని అంటున్నారు. అయితే  టీకాను కనుగొనేంత వరకు వరకు ప్రజలు సామాజిక దూరం పాటించాలని వారు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: