అదేంటి ప్ర‌పంచ వ్యాప్తంగాను.. మ‌న‌దేశంలోనూ క‌రోనా మ‌హ‌మ్మారి ఇంత తీవ్రంగా విజృంభిస్తోన్న వేళ జ‌గ‌న్ ప్ర‌భుత్వం క‌రోనా రోగుల‌కు వైద్యం చేయ‌వ‌ద్ద‌న్న సంచ‌న‌ల నిర్ణ‌యం తీసుకుందా ?  ఇది నిజ‌మేనా ? అన్న సందేహాలు ప్ర‌తి ఒక్క‌రికి క‌లుగుతాయి. అయితే ఇది నిజ‌మే. జ‌గ‌న్ స‌ర్కార్ క‌రోనా రోగుల‌కు వైద్యం చేయ‌వ‌ద్ద‌ని... ఆర్ఎంపీల‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఏపీలో చాలా మంది ఆర్ఎంపీలు క‌రోనా రోగుల‌కు వైద్యం చేస్తోన్న విష‌యం త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని కూడా స్ప‌ష్టం చేసింది.

 

ఒక‌వేళ ఎవ‌రికి అయినా క‌రోనా సోకింద‌న్న అనుమానాలు ఉన్న‌ట్టు ఆర్ఎంపీ వైద్యుల‌కు తెలిస్తే వారు వెంట‌నే స‌మీపంలోని ఆశా వ‌ర్క‌ర్లు, స్తానిక వ‌లంటీర్లు, ప్ర‌భుత్వ ఆసుప‌త్రి వైద్యుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని సూచించింది. అంతే కాకుండా ఈ ఉత్త‌ర్వులు ఉల్లంఘించే వారి విష‌యంలో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కూడా చెప్పింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు ప్ర‌తి జిల్లాకు ఒక కోవిడ్ ఆసుప‌త్రిని ఏర్పాటు చేస్తున్న‌ట్టు కూడా ప్ర‌భుత్వం తెలిపింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: