ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా నిన్న‌టి వ‌ర‌కు నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ఆర్టినెన్స్ ద్వారా తొల‌గించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌నను తొల‌గించిన ఏపీ ప్ర‌భుత్వం వెంట‌నే త‌మిళ‌నాడుకు చెందిన రిటైర్డ్ జ‌డ్జి జ‌స్టిస్ క‌న‌గ‌రాజ్‌ను నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేయ‌డం ఈ రోజు ఆయ‌న గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం చ‌కచ‌కా జ‌రిగిపోయాయి. జ‌గ‌న్ ఏం చేసినా ప్ర‌తిప‌క్ష పార్టీలు విమ‌ర్శ‌లు చేయ‌డం కామ‌న్‌. 

 

దాని గురించి ఇక్క‌డ ఎవ్వ‌రూ ప‌ట్టించుకోరు. అయితే రాజ్యాంగ‌బ‌ద్ధ ప‌ద‌విలో ఉన్న ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడుపై జ‌గ‌న్ తెలుగు భాష విష‌యంలో 
మీ మ‌న‌వ‌ళ్లు ఎక్క‌డ చ‌దువుతున్నారు ? అని ప్ర‌శ్నిస్తేనే తెలుగు త‌మ్మ‌ళ్లు నానా ర‌కాల విమ‌ర్శ‌లు చేశారు. రాజ్యాంగ‌బ‌ద్ధ ప‌ద‌విలో ఉన్న వెంక‌య్య‌ను అలా ? అనవ‌చ్చా ? అని నోరేసుకుని ప‌డిపోయారు.

 

మ‌రి ఇప్పుడు జ‌స్టిస్ క‌న‌గ‌రాజ్ అలా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారో లేదో తెలుగు త‌మ్ముళ్లు అప్పుడే ఆయ‌న‌పై విష ప్ర‌చారానికి తెర‌దీశారు. ఆయ‌న‌పై త‌మ సోష‌ల్ మీడియా గ్రూపుల్లో అనేక ర‌కాల విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ విమ‌ర్శ‌లు ఎంత స‌హేతుక‌మైన‌వో వాళ్లే ఆలోచించుకోవాలి. 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమైన రాజ్యాంగపదవిలో ఇతర పొరుగురాష్ట్రానికి చెందిన క్రీస్టియన్ మతస్తుడు.

హిందువులకు తెలుగువారికి తీవ్ర అవమానం.

ఆంధ్రప్రదేశ్‌ నూతన ఎన్నికల కమిషనర్‌గా తమిళనాడుకు చెందిన రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కనగరాజ్‌ (84)ను నియమించింది ఏపీ ప్రభుత్వం.

జస్టిస్‌ కనగరాజ్ గారు మద్రాస్‌ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. 1973 నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్నారు. 2006లో హైకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యారు.

గతంలో (2010) tamil Evangelical Lutheran Church (TELC) కి నిర్వాహకుడి (Administrator) గా పనిచేశారు.

ప్రస్తుతం చెన్నైలోని "Chevalier T. Thomas Elizabeth college for Women" కి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: