ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ చేస్తున్న బీభత్సం అంతా ఇంతా కదు.  చిన్నా పెద్ద అనే తేడాల లేదు.. సామాన్యుడు సెలబ్రెటీ అనే భేదం లేదు.. ఎవరినీ ఈ కరోనా వైరస్ వదలడం లేదు.  అగ్ర రాజ్యాలు సైతం విల విలాడుతున్నా నేపథ్యంలో మన దేశంలో గత నెల  24 నుంచి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  తాజాగా దేశంలో కరోనా వైరస్  విజృంభిస్తోన్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ ఎత్తివేతపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. లాక్‌డౌన్‌ను పొడిగించాలని ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ పాటు 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోదీని కోరారు.

 

తాజాగా లాక్ డౌన్ విషయంపై లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ స్పందించారు.  ప్రస్తుతం కరోనా వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ చర్య సరైన నిర్ణయమే కానీ.. లాక్ డౌన్ కారణంగా దేశంలో కోట్లాది మంది ఉపాధిని కోల్పోతున్నారని అన్నారు.  ఈ నేపథ్యంలో ఒక పద్ధతి ప్రకారం లాక్ డౌన్ ను క్రమంగా సడలించాలని సూచించారు. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కరోనా టెస్టింగ్ జరపాలని సూచించారు.  పెద్ద సంఖ్యలో జనాలు గుమికూడకుండా చూడాలని చెప్పారు. 130 కోట్ల జనాభాలో 200 మంది మరణించడం పెద్ద సంఖ్య కాదని అన్నారు.

 

మన దేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువగా కరోనా టెస్టులు జరుగుతున్నాయని చెప్పారు. 60 ఏళ్లు దాటిన వారు ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలని అన్నారు.  ఇక ఈ రోజు ప్రధాని మోదీ లాకౌ డౌన్ విషయంపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు.. దీని విషయంపై  ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: