కరోనా వైరస్ భారత్ పైన కూడా పంజా విసిరింది. ఈ మహమ్మారి నుండి భారత దేశ ప్రజలను కాపాడుకోవటం కోసం ప్రధాని మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ నేపధ్యంలో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న ప్రజలు లాక్ డౌన్ కొనసాగిస్తారా ? లేకా లాక్ డౌన్ ఎత్తివేస్తారా ? అన్న అంశంపై క్లారిటీ రాక ఇబ్బంది పడుతున్నారు. లాక్‌డౌన్‌ను పొడిగించాలని ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ పాటు 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోదీని కోరారు.కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒకవేళ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పొడిగిస్తే... ఆ  నిర్ణయాన్ని తాము స్వాగతిస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలిపారు.

 

‘నిశితమైన పరిశీలన తర్వాత కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు కేంద్రం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను పొడిగించినట్లయితే, దాన్ని బీఎస్పీ స్వాగతిస్తుంది’ అని అమె సోషల్ మాద్యం ద్వారా పోస్ట్ చేశారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకు సాగాలని అన్నారు. పేదలు, బలహీన వర్గాలు, కార్మికులు, రైతులకు సాయం చేయాలని, వారిని దృష్టిలో ఉంచుకొనే తగిన నిర్ణయాలు తీసుకోవాలని మాయావతి సూచించారు. 

 

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ ఎత్తివేతపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల సీఎంలు మోదీకి పలు సూచనలు చేశారు. 

 


కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

 

మరింత సమాచారం తెలుసుకోండి: