కరోనా వైరస్ భారత్ పైన కూడా పంజా విసిరింది. ఈ మహమ్మారి నుండి భారత దేశ ప్రజలను కాపాడుకోవటం కోసం ప్రధాని మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని లాక్ డౌన్ విధించారు.  నేడు మోదీతో జరిగిన కాన్ఫరెన్స్ లో ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇక్కడి పరిస్థితుల గురించి సమగ్ర సమాచారం అందించారు.  అయితే లాక్ డౌన్ పొడిగింపు విషయంలో సమాలోచన చేయాలని అన్నారు.  ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారు అన్న విషయంపై ముందుకు సాగుతామని అన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నామని అన్నారు.

 

అదే సమయంలో మానవతా కోణంలో స్పందిస్తున్నామని అన్నారు. 141 కంటైన్ మెంట్ క్లస్టర్లను హాట్ స్పాట్ గా గుర్తించామని.. రెడ్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం చేయాలనేది నా అభిప్రాయం అని అన్నారు. జనం గుమిగూడకుండా మాల్స్, సినిమా హాళ్లు, ప్రార్థనా మదిరాలపై ఇప్పుడున్న పరిస్థితి కొనసాగాగేలా చూడాలని ప్రధానితో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు జగన్ మోహన్ రెడ్డి. మిగతా  ప్రాంతాల్లో భౌతిక దూరం పాటిస్తే కరోనా విస్తరించకుండా ఉంటుందని అభిప్రాయం వెల్లడించారు.

 

ఏపిలో 37 మండలాలు రెడ్ జోన్ లో ఉన్నాయని.. 44 మండలాలు ఆరెంజ్ జోన్ లో ఉన్నాయని.. 595 మండలాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయి. ఒకే రకమైన వ్యూహంతో అందరూ ముందుకు సాగాలి.. పరిస్థితులకు అనుకూలంగా ఉండాలని అన్నారు. మీ నాయకత్వంపై పరిపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉందని అన్నారు. మరోవైపు లాక్‌డౌన్‌ను పొడిగించాలని ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ పాటు 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోదీని కోరుతున్న విషయం తెలిసిందే. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: