కరోనా కారణంగా దేశంలో  లాక్ డౌన్ విధించిన వేళ తన భార్య కు వైద్యం చేయించడానికి చాల కష్టపడ్డాడు. తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా కుంభ‌కోణంకు చెందిన అరివళగన్.అరివళగన్ ఒక  నిరుపేద రైతుకూలీ. తన భార్యకు  ఉన్న క్యాన్సర్ కు ట్రీట్మెంట్ కొరకు మూడు సెషన్స్ లో వైద్యం అందించాలని వైద్యులు చెప్పారు. అయితే అప్పటికే రెండు సెషన్ లను పూర్తి చేసుకున్న అరివాళగన్ భార్య మంజులకు  మూడవ సెషన్ కొరకు మర్చి 31 న చేయించాల్సి వుంది కావున మూడవ సెషన్ ను మిస్ కాకుడనుకున్న అరివాళగన్ మర్చి 31 సైకిల్ పై తన భార్యను తీసుకోని 120 కిమీ దూరంలోని పుదుచ్చేరిలోని జిప్‌మ‌ర్‌లో చికిత్స కొరకు బయలు దేరాడు. 

 

ఎంతో కష్టపడి 120 కిమీ దూరంలోని పుదుచ్చేరిలోని జిప్‌మ‌ర్‌ హాస్పిటల్ కి చేరుకున్న అతనికి జిప్‌మ‌ర్‌ లాక్ డౌన్ కారణంగా మూసివేసి ఉండడం చూసి షాక్ తిన్నాడు . చివరికి జిప్‌మ‌ర్‌ యాజమాన్యం అతని భాదను తెలుసుకుని అతని భార్యకు వైద్యం చేయడానికి ముందుకొచ్చారు. వైద్యం చేసిన తరువాత జిప్‌మ‌ర్‌  యాజమాన్యం వారి సొంత వెహికల్ లో తమ సొంత గ్రామానికి చేర్చారు 

మరింత సమాచారం తెలుసుకోండి: