ప్ర‌ప‌చం వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆదివారం ఉద‌యం వ‌ర‌కు చూస్తే క‌రోనా కేసులు ప్ర‌పంచ వ్యాప్తంగా 18 ల‌క్ష‌ల మంది క‌రోనా పాజిటివ్ భారీన ప‌డ్డారు. ఇక క‌రోనా భారీన ప‌డి మృతి చెందిన వారి సంఖ్య 1.08 ల‌క్ష‌ల‌కు చేరుకుంది. ఇక క‌రోనాకు గుర‌య్యి రిక‌వ‌రీ అయిన వారు 4 ల‌క్ష‌లుగా ఉన్నారు. ఇక మ‌న‌దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు చూస్తే క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8446 మంది క‌రోనాకు గుర‌వ్వ‌గా క‌రోనా మ‌ర‌ణాలు 288కు చేరుకున్నాయి. మ‌న దేశంలో క‌రోనా మ‌ర‌ణాలు, క‌రోనా కేసులు రెండూ కూడా మ‌హారాష్ట్ర‌లోనే న‌మోదు అయ్యాయి.

 

ఇక మ‌న‌దేశంలో క‌రోనా ప్ర‌భావం అన్ని రంగాల‌పై తీవ్రంగా ఉంది. ఈ క్ర‌మంలోనే కోట్ల‌లోనే ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఈ విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. చివ‌ర‌కు తెలుగులో మీడియా రంగాన్ని కూడా తాకిన క‌రోనా దెబ్బ‌తో వంద‌ల్లో ఉద్యోగాలు పోతున్నాయి. ఇక మ‌న‌దేశంలో ఎగుమ‌తులు ఇప్ప‌టికే ఆగిపోయాయి. ఇక ఈ ఎగుమ‌తులు ఎప్ప‌ట‌కి ప్రారంభ‌మ‌వుతాయో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. అయితే ఈ రంగంలో ఉన్న సంక్షోభం నేప‌థ్యంలో ఇప్పుడు ఏకంగా కోటిన్న‌ర ఉద్యోగాలు పోతాయ‌ని తెలుస్తోంది. కోటిన్న‌ర ఉద్యోగాలు అంటే చాలా కుటుంబాలు, వారిపై ఆధార‌ప‌డ్డ వారు రోడ్డున ప‌డ‌డం.. ఇది మ‌రింత సంక్షోభానికి కార‌ణ‌మ‌వ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: