కోవిడ్‌-19 ఎఫెక్ట్‌తో జ‌న జీవ‌నం పూర్తిగా స్తంభించింది. ప్ర‌జ‌లంతా కూడా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు  మాత్ర‌మే లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపు ఇచ్చారు.  

 

లాక్‌డౌన్ కారణంగా స్వ‌చ్ఛంద ర‌క్త సేక‌ర‌ణ శిబిరాలు నిలిచిపోయాయి.  రాష్ట్రంలోని ప‌లు ప్ర‌ధాన ద‌వాఖాన‌ల్లో ఏర్పాటు చేసిన ర‌క్త‌నిధి కేంద్రాల్లో కొర‌త ఏర్ప‌డింది.   

 

ఉత్త‌ర తెలంగాణ‌కు పెద్ద దిక్కైన వ‌రంగల్ ఎంజీఎం ద‌వాఖాన‌లోని ర‌క్త‌నిధి కేంద్రంలో కూడా నిల్వ‌లు నిండుకున్నాయి. ఫ‌లితంగా పేద‌, అత్య‌వ‌స‌ర రో గుల‌తోపాటు, ప్రమాదాల్లో తీవ్ర గాయాలైన వారికి ఇబ్బందులు త‌ప్ప‌డంలేదు.

 

గ‌తంలో ద‌వాఖాన‌లో 300 వంద‌ల‌కుపైగా అన్ని ర‌కాల‌ గ్రూపులు నిల్వ ఉండేవి. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ ప్ర‌భావంతో వంద ర‌క్త నిల్వ‌లు మాత్ర‌మే నిల్వ ఉన్నాయ‌ని ఎంజీఎం ద‌వాఖాన సూప‌రింటెండెంట్ శ్రీనివాస‌రావు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: