కరోనా వైరస్ మానవ జాతిని కబళిస్తున్న వేళ లాక్ డౌన్ విధులను నిర్వహిస్తున్న పోలీసులపై కత్తులతో దాడి చేసి ఏఎస్ఐ చేయి నరికివేశారు.  ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రంలోని పాటియాల జిల్లాలో ఆదివారం (ఏప్రిల్ 12) ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.లాక్ డౌన్ విధులను నిర్వహిస్తున్న పోలీసులపై దాష్టికానికి తెగబడ్డారు.  స్థానిక కూరగాయల మార్కెట్లో ప్రజలను నియంత్రిస్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడ్డ పొలిసు అధికారిని  హుటాహుటిన చండీఘర్ ఆస్పత్రి కి తరలించారు. వైద్యులు శస్త్రచికిత్స నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తున్నారు.

ఘటనపై పంజాబ్ పోలీస్ బాస్ దినకర్ గుప్తా ట్వీట్ చేశారు. నిహంగ్ వర్గానికి చెందిన కొంత మంది కొంతమంది డ్యూటీ లో ఉన్న పోలీసులపై కత్తులతో దడి చేసి ఏఎస్‌ఐ హర్జీత్ సింగ్‌తో పాటు మండీ బోర్డు అధికారి గాయపరిచారని ఆయన ట్వీట్ చేశారు. పోలీస్ అధికారులు ఇప్పటికే వారి గ్రూప్ కి సంబందించిన ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు . నిందితులు పరారీలో ఉన్నారని ఆయన తెలిపారు. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్న వేళ ఇలాంటి సంఘటనలు చాల బాధాకరం

మరింత సమాచారం తెలుసుకోండి: