కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనాను కట్టడి చేయలేక విల‌విల‌లాడుతోంది.  అత్యాధునిక వైద్య వ్యవస్థ.. అన్ని సౌకర్యాలు కలిగిన దేశాలు కూడా చేతులెత్తేస్తున్నాయి. తమ ప్రజల ప్రాణాలు కాపాడుకోలేకపోతున్నాయి. భారత్‌లో కూడా కోవిడ్-19 విజృంభిస్తోంది.  అయితే  దేశం మొత్తం వ్యాప్తి చెందుతున్నవేళ... కేరళలో మాత్రం తగ్గుముఖం పట్టాయి. 

 

క‌రోనా వైరస్ నియంత్రణలో కేరళ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం కరోనా ప్రభావిత రాష్ట్రాలలో ఏనిమిదో స్థానం లో ఉంది. కేరళ ఇప్పటికే వరదలతో అతలాకుతలమైంది. అదేవిధంగా నిఫా వైరస్ ప్రతాపం చూపింది. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా అన్నింటిని ధైర్యంగా ఎదుర్కొంది.

 

ఇప్పుడు కరోనా మహమ్మారి కోరలు కత్తిరిస్తోంది. వైరస్ నియంత్రణకు కేరళ తీసుకున్న చర్యలను ఇతర రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా కేంద్రం కూడ అనుసరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: