క‌రోనా సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌పంచం మొత్తం స్తంభించిపోయింది. అన్నిరంగాల కార్య‌క‌లాపాలు ఆగిపోయాయి. ఒక్క నిత్యావ‌స‌ర స‌రుకులు, అత్య‌వ‌స‌ర మందుల అమ్మ‌కాలు మాత్ర‌మే సాగుతున్నాయి. కానీ.. మ‌రో మ‌రో వ్యాపారానికి మాత్రం క‌రోనా బాగా క‌లిసొచ్చింది. ఇప్పుడు ఆ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఏకంగా రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్నారు. బాగా సంపాదిస్తున్నారు.. ఇంత‌కీ ఏమిటా వ్యాపారం అని అనుకుంటున్నారా..? అదే శ‌వ‌పేటిక వ్యాపారం.. ఆశ్చ‌ర్య‌పోకండి.. మీరు చ‌దువుతున్న‌ది నిజ‌మే.. ఆ వివ‌రాలేమిటో చూద్దాం.. క‌రోనా ప్ర‌తానికి ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌నం పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. ఇక యూర‌ప్‌లో అయితే ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంది. రోజుకు వంద‌ల‌, వేల సంఖ్య‌లో జ‌నం మ‌ర‌ణిస్తున్నారు. మృత‌దేహాల‌ను ఎక్క‌డ పూడ్చాలో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. ప్ర‌పంచం మొత్తం దాదాపుగా ల‌క్ష మ‌ర‌ణాల‌కు పైగా సంభ‌విస్తే.. ఒక్క యూర‌ప్‌లోనే సగం ఉండ‌డం గ‌మ‌నార్హం. 

 

ఆ త‌ర్వాత అమెరికాలో క‌రోనా బీభ‌త్సం సృష్టిస్తోంది. ఇక్క‌డ కూడా వేల సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. ఇప్ప‌టికే సుమారు 20వేల‌కు చేరువ‌లో మ‌ర‌ణాల సంఖ్య చేరుకుది. అయితే.. శ‌వ‌పేటిక‌ల వ్యాపారం యూరోప్‌లో ఇప్పుడు శ‌వ‌పేటిక‌ల జోరుగా సాగుతోంది. క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల మ‌ర‌ణాల రేటు పెర‌గ‌డంతో.. శ‌వ‌పేటిక‌ల వ్యాపార కంపెనీలు ప‌గ‌లురాత్రి తేడా లేకుండా ప‌నిచేస్తున్నాయి. కానీ యూరోప్‌లో శ‌వ‌పేటిక‌లు త‌యారు చేసే అతిపెద్ద కంపెనీ ఓజీఎఫ్ మాత్రం త‌మ ఉద్యోగుల‌ను ఓవ‌ర్‌టైం ప‌నిచేయించుకుంటున్న‌ది. నిజంగా క‌న్నీటిగాథ‌నే. ఈస్ట్ర‌న్ ఫ్రాన్స్‌లో ఈ కంపెనీ ఉన్న‌ది. త‌మ బంధువులు వైర‌స్‌తో మృతిచెందుతున్న నేప‌థ్యంలో.. అక్క‌డ శ‌వ‌పేటిక‌ల‌కు డిమాండ్ పెరిగింది. అయితే ప్ర‌స్తుతం డిమాండ్ అధికంగా ఉన్న కార‌ణంగా.. కేవ‌లం నాలుగు ర‌కాల టాప్ మోడ‌ల్స్ మాత్ర‌మే త‌యారు చేస్తున్న‌ట్లు ఓజీఎఫ్ డైర‌క్ట‌ర్ ఎమ్మాన్యువ‌ల్ గారెట్ ఈసంద‌ర్భంగా తెలిపారు. సాధార‌ణంగా మామూలు స‌మ‌యంలో ఆ కంపెనీ సుమారు 15 ర‌కాల కాఫిన్‌ల‌ను త‌యారు చేస్తుంటుందిఈ కంపెనీ. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: