క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనేక చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. వైర‌స్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్త‌ల‌పై నిరంత‌రం అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో పోలీసులు కూడా ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌జ‌లు సామాజిక దూరం పాటించాల‌ని, ఇదొక్క‌టే మ‌న చేతిలో ప్ర‌ధాన ఆయుధ‌మ‌ని చెబుతున్నారు. లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ప్ర‌జ‌లు గౌర‌వించాల‌ని, అన‌వ‌స‌రంగా ఇళ్ల నుంచి బ‌య‌కుట రావొద్దంటూ ప్ర‌చారం చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి ఈ క్ర‌మంలో సైబ‌రాబాద్ పోలీసులు ప్ర‌జ‌ల‌కు లాక్‌డౌన్‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఓ పాట‌ను రూపొందించి విడుద‌ల చేశారు. ఈ సాంగ్‌ వీడియోని త‌మ ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశారు. ఇందులోని లిరిక్స్ జొన్న విత్తుల రాయ‌గా, శ్రీ కృష్ణ ఆల‌పించారు. దీనిపై  మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 

 

* క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు జొన్న‌విత్తుల అద్భుత‌మైన లిరిక్స్ రాశారు. అలానే శ్రీ కృష్ణ కూడా బాగా పాడారు. ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌న పెంచేందుకు సైబ‌రాబాద్ పోలీసులు చేసిన ప్ర‌య‌త్నం బాగుంది.  శ్రీ స‌జ్జ‌నార్ ప్ర‌య‌త్నాన్ని అభినందిస్తున్నాను* అని చిరు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా.. ఇటీవ‌ల పోలీసుల సేవ‌ల‌ను కొనియాడుతూ కూడా వీడియోను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. పోలీసుల ప‌నితీరు అద్భ‌తంగా ఉంద‌ని, పోలీస్ బిడ్డ‌గా పోలీస్ వారికి సెల్యూట్ చేస్తున్నాననంటూ ఆయ‌న ఆ వీడియోలో పేర్కొన్నారు. దీనిపై డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి స్పందిస్తూ.. చిరంజీవి మాట‌లు త‌మ‌కెంతో స్ఫూర్తినిస్తున్నాయని అన్నారు. తాజాగా.. పాట విడుద‌ల చేసిన సైబరాబాద్ పోలీసుల‌ను మెచ్చుకుంటూ మెగాస్టార్‌ ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: