క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రాళ నృత్యం చేస్తోంది. కోవిడ్-19 భారిన ప‌డి అగ్ర దేశాలు సైతం అత‌లాకుత‌లం అవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా చివురుటాకుల వ‌ణికిపోతుంది. దేశంలోని మ‌హాన‌గ‌ర‌మైన న్యూయార్క్ లో క‌రోనా మ‌ర‌ణ మృదంగం మోగిస్తోంది. ఈ నేప‌థ్యంలో అక్క‌డి ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.


కరోనా మహమ్మారి ప్రభావం తగ్గని కారణంగా విద్యా సంవత్సరం ముగిసేంత వరకూ స్కూళ్లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలో అమెరికాలో అతిపెద్ద మహా నగరంగా ఉన్న న్యూయార్క్ లో విద్యార్థులకు ఆగస్టు వరకూ సెలవులుంటాయని నగర మేయర్ బిల్ డీ బ్లాసియో తెలిపారు.

 

సెప్టెంబర్ లో మాత్రమే పబ్లిక్ స్కూళ్లు తిరిగి తెరచుకునే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. మెట్రోపాలిటన్ రీజియన్ లోని అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపిన తరువాతనే విద్యార్థులు, ప్రజల ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: