మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కేంద్ర ప్రభుత్వంపై ఆదివారం సంచలన ఆరోపణలు చేశారు.  మధ్యప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటు పూర్తయ్యే వరకూ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడాన్ని బీజేపీ వాయిదా వేసిందని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ కమల్‌నాథ్ కమల్‌నాథ్ తీవ్రంగా మండిప‌డ్డారు.  


ముఖ్యమంత్రిగా మార్చి 20 న తాను రాజీనామా చేశాన‌ని, కానీ మార్చి 23న ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ బాధ్యతలు చేపట్టిన తర్వాతే కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ ను ప్రకటించింద‌న్నారు.

 

 మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో అధికారం కోసం కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ ను వాయిదా వేసింద‌ని ఆరోపించారు.  
కరోనా మహమ్మారి విజృంభించే అవకాశాలున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఫిబ్రవరిలోనే హెచ్చరించిన‌ట్లు ఆయ‌న గుర్తు చేశారు. అయినా కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేద‌ని అని తీవ్రంగా విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: