వ‌రంగ‌ల్ జిల్లాలో క‌రోనా క‌ల‌క‌లం సృష్టిస్తోంది. పాజిటివ్ కేసులు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతుండ‌టంతో ప్ర‌జ‌లు భంయాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్న ప్రాంతాల‌ను గుర్తించి హాట్ స్పాట్ లుగా ప్ర‌క‌టించారు. న‌గ‌రంలో మొత్తం 15 ప్రాంతాల‌ను రెడ్ జోన్లుగా ప్ర‌క‌టించి పూర్తిగా దిగ్భందించారు. దీంతో గ‌త మూడు రోజులుగా ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చింది.

 
వ‌రంగ‌ల్ లో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం ప‌డ‌డంతో ప్ర‌జ‌లు కాస్తా ఊపిరి పీల్చుకున్నారు.తాజాగా హ‌న్మ‌కొండ‌లో మ‌రో పాజిటివ్ న‌మోదు అవ‌డంతో  ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతుంది.  క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన వ్య‌క్తి హ‌న్మ‌కొండ సుబేదారికి చెందిన వాడు  కావ‌డంతో స్థానికులు భ‌య‌బ్రాంతుల‌కు గుర‌వుతున్నారు. కాగా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 32 కి చేరింది. వీరిలో ఇద్ద‌రు ద‌వాఖానాలో చికిత్స తీసుకొని ఇంటికి వెళ్ల‌గా మిగ‌తా వారిని సికింద్రాబాద్ గాంధీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: