కరోనా మహమ్మారి ధాటికి మహారాష్ట్ర చిగురుటాగులా వణుకుతోంది. మ‌న‌దేశంలో మిగిలిన రాష్ట్రాల ప‌రిస్థితి ఎలా ఉన్నా మ‌హారాష్ట్ర‌లో ప‌రిస్థితులు ఘోరంగా ఉన్నాయి. మ‌హారాష్ట్ర‌లో ఇప్ప‌టికే 1761 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, తాజాగా మరో 134 మందికి ఈ వైరస్‌ సోకింది. తాజా అప్‌డేట్‌తో మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసులు ఇప్ప‌టి వ‌ర‌కు కేసుల సంఖ్య 1895కు చేరుకుంది.

 

ఆదివారం నమోదైన 134 కేసుల్లో ముంబైలో 113, పుణేలో 4, మీరా భయందర్‌లో 7, నావి ముంబైలో 2, తానే, వాసై విరార్‌,రైగా, అమరావతి, భివాండి, పింప్రీ-చిన్చ్వడ్‌లో  ఒక్కో ఒక్కో పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఇక దేశ‌వ్యాప్తంగా అత్య‌ధికంగా.. మిగిలిన రాష్ట్రాల‌కు అంద‌కుండా మ‌హారాష్ట్ర‌లో 127 మంది మృతిచెందారు. ఇక సీఎం ఉద్ద‌వ్ థాక్రే ప‌రిస్థితిని స‌మీక్షించిన త‌ర్వాత లాక్‌డౌన్ పొడిగింపు ఒక్క‌టే మార్గ‌మ‌ని నిర్ణ‌యించారు. ఈ టైంలో రాజ‌కీయాలు అన‌వ‌స‌రం అని కూడా చెప్పారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: