లాక్ డౌన్ కారణంగా ఎన్నో దుర్ఘటనలు మరియు దుర్మార్గాలు జరుగుతున్న వేళ. ఓ యువకుడు సెల్ఫ్ క్వారంటైన్ లో యువకుడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌ లో చోటుచేసుకుంది. పెళ్ళైన  తొమ్మిది నెలలక్రిందట ఉపాధికోసం పక్కరాష్ట్రానికి వలస వెళ్ళాడు . లాక్ డౌన్ కారణంగా ఇంటికి తిరిగి వచ్చాడు కానీ అధికారులు అతనిని సెల్ఫ్ క్వారైటైన్ కి తరలించారు . అయితే తీవ్ర మనస్తాపానికి గురియైన ఆయువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

 

ఈ విషాద ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫ్ఫర్‌నగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది.
ముజఫ్ఫర్‌నగర్‌ జిల్లాలో చాపర్ పరిధిలోని ఖింద్రియా గ్రామానికి చెందిన అషు(21) హోమ్ క్వారంటైన్ ఉంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. చండీగఢ్‌లో పనిచేసే అషు కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ చేయడంతో ఇంటికి తిరిగి వచ్చాడు . కానీ అతన్ని హోమ్ క్వారంటైన్ ఉంచినందున ఆ యువకుడు ఆత్మా హత్య చేసుకున్నాడు .అషుకి తొమ్మిది నెలల కిందటే వివాహమైనట్లు తెలుస్తోంది. ఇంట్లో క్వారంటైన్‌లో ఉంచడంతోనే యువకుడు మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.విషయం తెలుసుకున్న పోలీస్ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరి కేసునమోదు చేసారు 

మరింత సమాచారం తెలుసుకోండి: