కరోనా కష్టకాలం దాపురించింది అందుకే ప్రపంచ పెద్దన్న అమెరికా కూడా చేతులెత్తేసింది. ప్రపంచ దేశాలలో కరోనా మహమ్మారి నానాటికి పెరుగుతూనే ఉంది. దేశంలోని  కేరళలో కరోనా కట్టడి చర్యలు చాల పకడ్బందీగా అమలవుతున్నాయి. ఆదివారం రోజు ఆ రాష్ట్రంలో కేవలం 2 కేసులే నమోదు కావడం విశేషం. ఇప్పటివరకు మహారాష్ట్రలో 1761 కేసులు నమోదు కాగా అందులో 208 డీఛార్జి కాగా కేరళలో 179 మందిని డీఛార్జి చేయడం ద్వారా తర్వాతి స్థానంలో కేరళ ఉంది.

 

కానీ కేరళలో ఇప్పటివరకు నమోదు అయినా కేసుల సంఖ్యా 374 మాత్రమే. లాక్ డౌన్ ని కేరళ ప్రభుత్వం కట్టుదిట్టం చేసినందువల్ల కరోనా కేసులు నిలకడగా ఉన్నాయని అక్కడి వైద్య నిపుణులు చెబుతున్నారు. కేరళ ప్రభుత్వం లాక్ డౌన్ సమయంలో నిత్యావసరాలను ఇంటికే తెచ్చి ఇవ్వడం , ఎక్కువ మందికి కరోనా టెస్టులు నిర్వహించడం మరియు కఠిన నిబంధనల వల్లే ఇది సాధ్యమైంది అని కేరళ ప్రభుత్వం చెబుతోంది. మరి అన్ని రాష్ట్రాలు కేరళని ఆదర్శం గా తీసుకొంటే కరోనా కట్టడి ఏమాత్రము కష్టం కాదని నిపుణులు చెబుతున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: