తాను న‌టించ‌నున్న కొత్త సినిమాలో బోల్డ్‌నెస్ తప్ప బూతులు ఉండవ‌ని బాలివుడ్ బ్యూటీ ఈషా అంటోంది. హ‌ద్దుల మేర‌కే అందాల ఆరోబోత‌కు సిద్ధం అని కూడా చెబుతోంది ఈ అమ్మ‌డు. అస‌లు విష‌యానికి వ‌స్తే...  హిందీలో తెరకెక్కిన `లస్ట్‌స్టోరీస్` వెబ్‌సిరీస్ ఎంత పాపులర్ అయిందో అంద‌రికీ తెలిసిం దే. ఈ వెబ్‌సిరీస్‌లో అత్యంత బోల్డ్‌గా నటించి మంచి గుర్తింపు  సంపాదించుకుంది కియారా ఆడ్వాణీ. స్వయంతృప్తి పొందే గృహిణి పాత్రలో నటించి సం చలనం సృష్టించింది. ఈ వెబ్‌సిరీస్ ను ప్రస్తుతం తెలుగులోకి రీమేక్  చేస్తున్నారు.

 


సంకల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో కియార పాత్రలో ఈషా కనిపించనుందట. ఇటీవల‌ ఓ ఇంటర్వ్యూలో ఈషా ఈ విష‌యాన్ని స్వ యంగా వెల్ల‌డించింది. మూవీలో కియార తరహాలోనే ఈషా కూడా హాట్‌హాట్‌గా  నటించనుందట. బోల్డ్ సీన్స్‌లో కియార తరహాలోనే కనిపించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. `కథ ప్రకారమే ఈ వెబ్ సిరీస్‌లో కూడా సెక్స్ కం టెంట్ ఉంటుంది. బోల్డ్‌నెస్, హాట్‌నెస్ ఉంటుంది. అయితే అది హద్దులు దాటదు. బోల్డ్‌నెస్ తప్ప బూతు కంటెంట్ ఉండద`ని  చెప్పింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: