ఏపీలో కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న జోరు చూస్తుంటే క‌రోనా పాజిటివ్ కేసులు రేపో మాపో 450 క్రాస్ చేసి 500 దిశ‌గా దూసుకు వెళ్ల‌నున్నాయి. ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా ఏడుకు చేరుకున్నాయి. తాజాగా న‌మోదు అయిన 12 కొత్త కేసుల‌తో ఇప్ప‌టికే క‌రోనా కేసులు 432కు చేరుకున్నాయి. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో 12 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. అయితే గుంటూరు జిల్లాలో క‌రోనా డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. ప్ర‌స్తుతం గుంటూరులో అంత‌టా క‌ర్ఫ్యూ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

 

అయితే ఇక్క‌డ ఢిల్లీలోని మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లి వ‌చ్చిన వారి సంఖ్య ఎక్కువుగా ఉండ‌డంతో పాటు వారు అనేక‌మందితో కాంటాక్ట్ అయ్యారు. దీంతో ప్ర‌భుత్వం ఇప్ప‌టికే వారు ఎవ‌రెవ‌రితో క‌లిశారో సర్వే కంప్లీట్ చేసినా.. మ‌రికొంత మందికి క‌రోనా సోకింద‌న్న అనుమానాలు అయితే ఉన్నాయి. ప్ర‌స్తుతం ప‌రిశీల‌న‌లో ఉన్న శాంపుల్స్‌లో మ‌రి కొంత‌మందికి కూడా పాజిటివ్ రావొచ్చ‌ని అంటున్నారు. 

 

రాత్రి 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 10 గంటల వరకు చేసిన పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 12 కేసులు బయటపడ్డాయి. వీటిలో అత్యథికంగా గుంటూరు నుంచి 8  కేసులు నమోదైయ్యాయి. ప్రస్తుతం గుంటూరు లో 90 కర్నూలు లో 84 నెల్లూరు లో 52 ప్రకాశంలో 41 కేసులు నమోదయ్యాయి.  ఇక నిన్న‌టి వ‌ర‌కు టాప్‌లో ఉన్న క‌ర్నూలును క్రాస్ చేసి మ‌రీ గుంటూరు టాప్ ప్లేస్‌లో ఉంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: