భారత దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.  ఎప్పటికప్పుడు అధికారుల, ప్రజా ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ పరిస్థితులపై సమీక్షలు నిర్వహిస్తున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.  కరోనా లాక్ డౌన్ విషయంలో కూడా తనదైన డైనమిక్ నిర్ణయాన్ని వెలిబుచ్చారు.  ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్పిరెన్స్ లో ఏపి లో కరోనా పరిస్థితులపై క్షుణ్ణంగా వివరిస్తూ వస్తున్నారు.  తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనాను అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మరో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 

డాక్టర్‌ వైఎస్సార్‌ టెలిమెడిసిన్‌ కార్యక్రమం పేరిట ఔషధాల పంపిణీ అమలు కోసం ప్రత్యేకంగా టోల్‌ ఫ్రీ నెంబరు 14410 ప్రారంభించారు.  ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తారని చెప్పింది. ఈ టోల్ ఫ్రీ నబరు 14410కు ఫోన్ చేసిన జగన్‌ డాక్టర్‌తో మాట్లాడారు. ఈ కొత్త కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో కరోనా కేసులను గుర్తించి, బాధితులను ఐసొలేట్‌కు తరలిస్తారు.  ఇప్పటికే 286 మంది వైద్యులు, 114 మంది ఎగ్జిక్యూటివ్స్‌ ముందుకు వచ్చారని ప్రభుత్వం తెలిపింది.

 

అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అవసరమైన ఔషథాలను ప్రత్యేకంగా ఆశా వర్కర్లు, ఎఎన్‌ఎంలు, గ్రామ వార్డు వాలంటీర్లు నేరుగా ఇంటికే తీసుకొచ్చి ఇస్తారు. 14410 టోల్‌ ఫ్రీ నెంబరుకు రోగులు మిస్డ్‌ కాల్‌ ఇస్తే అక్కడి సిస్టమ్‌ ఆ మొబైల్‌ నెంబరును, మొత్తం వివరాలను నమోదు చేసుకుంటుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ప్రజలు ఈ సేవలను తప్పకుండా వినియోగించుకోవాలని.. కరోనాపై యుద్దం చేస్తున్నామని.. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

మరింత సమాచారం తెలుసుకోండి: