తెలంగాణ ప్ర‌భుత్వం క‌రోనా క‌ట్ట‌డికి చేస్తున్న ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లీకృతం అయ్యాయి. కరోనా వైరస్ నివారణలో భాగంగా అనుమానితులు దేశవిదేశ ప్రయాణాలు చేసిన వారిని క్వారంటైన్ ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంచగా అవన్నీ బాధితులతో కిటకిటలాడాయి. ప్రస్తుతం వారి గడువు ముగిసి ఎలాంటి వ్యాధి లేకపోవడంతో వారంతా ఇళ్లకు వెళ్తున్నారు. దీంతో ఆ కేంద్రాలన్నీ ఖాళీ అవుతుండడం సంతోషించదగ్గ విషయం.

 

ఐసోలేషన్ కేంద్రాలుగా ఉన్న హైదరాబాద్ లోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రి నేచర్క్యూర్ ఆస్పత్రి నిజామియా ఆస్పత్రులు ఖాళీ అయ్యాయి. రాజేంద్రనగర్లో ఐదు క్వారంటైన్ సెంటర్లలలో కూడా ప్రజలు తగ్గిపోతున్నారు. వీటిలో ప్రస్తుతం 160 మంది ఉన్నారు.

 

మేడ్చల్ జిల్లాలో 152 మంది రంగారెడ్డి జిల్లాలో 135 మంది మాత్రమే ఉన్నారు. గాంధీ కింగ్ కోటి ఫీవర్ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డుల్లో మరో 364 మంది కరోనా అనుమానితులు ఉన్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో వీరిలో ఎవరికైనా పాజిటివ్ వస్తే.. వెంటనే ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. నెగిటివ్ రిపోర్టు వచ్చిన వారిని హోం క్వారంటైన్ కు తరలించి వారు ఇంటి నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: