దేశరాజధాని ఢిల్లీలోని కొన్న ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పై  భూకంప తీవ్రత 4.0 గా నమోదయింది. ఉత్తారాకండ్ లో కూడా స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. కానీ ఢిల్లీలో భూకంప ప్రభావం కొద్దిగా ఎక్కువ కనిపించింది. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ విషయంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీలో భూకం వచ్చింది.. దేవుడి దయ వల్ల ఎవరికీ ప్రాణహానీ జరగలేదు.. ఆస్తి నష్టం జరగలేదని వ్యాఖ్యానించారు. అయితే ఢిల్లీలో ఇవాళ కూడా భూమి కంపించింది.

 

ఈ మధ్యాహ్నం 2.7 తీవ్రతతో ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఈ భూకంప కేంద్రం ఉత్తర ఢిల్లీలోని వజీరాబాద్ లో ఉన్నట్టు గుర్తించారు. ఈ ప్రకంపనలతో ప్రజలు ఇళ్లలోంచి బయటికి  పరుగులు తీశారు. ఓవైపు కరోనా ఆందోళనలు, మరోవైపు భూకంప భయాలతో హడలిపోయారు. దేశంలోని ఐదు భూకంప జోన్లలో ఢిల్లీలో నాలుగో జోన్ లో ఉంది.

 

సాధారణంగా మధ్య ఆసియా, హిమాలయ ప్రాంతంలో భూకంపాలు సంభవిస్తే ఢిల్లీలోనూ ప్రకంపనలు వస్తుంటాయి. ఈసారి అందుకు భిన్నంగా ఢిల్లీలోనే భూకంప కేంద్రం ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. ఇప్పటికే ఢిల్లీలో కరోనా భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు.. ఈ సమయంలో ఈ భూకంతో ఇళ్లు ఎక్కడ కూలుతాయో అన్న భయాందోళనకు గురి అవుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: