మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న చ‌రిత్ర చంద్ర‌బాబుద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. వెన్నుపోటు ఎలా పొడ‌వ‌చ్చో చంద్ర‌బాబు ద‌గ్గ‌ర నేర్చుకోవ‌చ్చున‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. శ‌వాల‌ను చూస్తే.. చంద్ర‌బాబుకు ఎక్క‌డా లేని ఉత్సాహం వ‌స్తుంద‌ని, శ‌వ‌రాజ‌కీయాలు చేయ‌డంలో చంద్ర‌బాబు దిట్ట‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌త ఐదేళ్ల చంద్ర‌బాబు చేసింది ప్ర‌చార ఆర్భాట‌మేన‌ని.. అంత‌కుమించి ఆయ‌న ఏమీ చేయ‌లేద‌ని నాని అన్నారు.

 

చంద్ర‌బాబులా వైఎస్ జ‌గ‌న్‌కు ప్ర‌చార పిచ్చిలేద‌ని నాని అన్నారు. క‌ష్ట‌కాలంలో ప్ర‌భుత్వానికి స‌ల‌హాలుసూచ‌ల‌ను ఇవ్వ‌కుండా.. ప‌నికిమాలిన లేఖ‌లు రాసుకుంటూ చంద్ర‌బాబు కూర్చుంటున్నార‌ని అన్నారు. హైద‌రాబాద్‌లో ఉంటూ ప‌నికిమాలిన మాట‌లు మాట్లాడుతున్న చంద్ర‌బాబుకు ఏమాత్ర‌మూ బుద్ధిలేద‌ని మండిప‌డ్డారు. హైద‌రాబాద్‌లోకూర్చొని చంద్ర‌బాబు చీఫ్ రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌ల‌కు కోసం నిర్ణ‌యాలు తీసుకునే ప్ర‌భుత్వం త‌మ‌ద‌ని కొడాలి నాని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జాసంక్షేమం కోసం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డుతున్నార‌ని కొడాలి నాని స్ప‌ష్టం చేశారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: