కేంద్రం నిర్ణ‌యంతో సంబంధం లేకుండా లాక్‌డౌన్‌ను పొడిగించిన రాష్ట్రాల జాబితాలో తాజాగా త‌మిళ‌నాడు కూడా చేరింది. ఏప్రిల్ 30వ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ముఖ్యమంత్రి ఎడపడ్డి కె పళనిస్వామి ప్రకటించారు. త‌మిళ‌నాడులో క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి లాక్‌డౌన్ పొడిగిస్తున్న‌ట్లు తెలిపారు. దీంతో దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగించిన రాష్ట్రాల సంఖ్య ఏడుకు చేరింది. ఇప్ప‌టికే ఆరు రాష్ట్రాలు ఈ నెలాఖ‌రు వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నాయి. ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ తర్వాత పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.

 

ఈ జాబితాలో తాజాగా త‌మిళ‌నాడు చేరింది. కాగా, భారత్‌లో మొత్తం కేసులు సోమవారం సాయంత్రం నాలుగు గంట‌ల‌కు  9,152 కు చేరుకున్నాయి. మరణాల సంఖ్య 308కు చేరింది. ఇక 24గంట‌ల వ్య‌వ‌ధిలో 796 కొత్త కేసులు న‌మోదు కాగా, 35 మరణాలు సంభ‌వించాయి. వీటిలో 7,987 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  856 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గరిష్ట కేసులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. మంగ‌ళ‌వారం ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సంద‌ర్భంగానే లాక‌క్‌డౌన్‌పై కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: