తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం రేపుతోంది. ఈ మ‌హ‌మ్మారి ప్ర‌భావం రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైద‌ర‌బాద్ మ‌హాన‌గ‌రాన్ని తీవ్ర క‌ల‌వరానికి గురి చేస్తోంది. ఈ ప‌రిణ‌మాల‌ను దీనిని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్రంగా తీసుకున్నారు. న‌గ‌రంలో మొత్తం 275 పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డంతో క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి హైదరాబాద్‌పై ప్ర‌త్యేక దృష్టి సారించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ మేర‌కు ప్ర‌త్యేక వ్యూహం ర‌చిస్తున్నారు. ఈరోజు ప్ర‌గ‌తి భ‌వ‌న‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అత్యున్న‌త స్థాయి స‌మావేశంలో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. హైద‌రాబాద్‌లో అత్య‌ధికంగా పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డాన్ని అంద‌రం ఛాలెంజింగ్‌గా తీసుకుని మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించారు.

 

జీహెచ్ఎంసీలో కేసుల సంఖ్య‌ పెర‌గ‌డాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించాల‌ని ఆయ‌న అన్నారు. పోలీసు, వైద్య శాఖలు అన్నివిధాలా సిద్దంగా ఉండాల‌ని ఆదేశించారు. ప్ర‌తీరోజు సుమారు 1100 మందికి పరీక్ష‌లు చేసేలా ఏర్పాట్లు చేయాల‌ని అన్నారు. ఇదే స‌మ‌యంలో సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక నుంచి జీహెచ్ఎంసీలో క‌రోనా క‌ట్ట‌డి బాధ్య‌త‌ల‌ను మంత్రి కేటీఆర్‌కు అప్ప‌గించారు. మంత్రులు ప్ర‌తీరోజు స‌మీక్ష చేయాల‌ని అన్నారు. ముఖ్యంగా కంటైన్మెంట్ జోన్ల‌లో ప్ర‌జ‌లు ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకుండా క‌ఠిన‌ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు. ఇక తెలంగాణ‌లో మొత్తం 246 కంటైన్మెంట్ జోన్లు ఉండ‌గా.. ఒక్క‌  హైద‌ర‌బాద్‌లోనే మొత్తం 126 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. హైద‌రాబాద్ మొత్తం 17యూనిట్లుగా విభ‌జించి, ఒక్కో యూనిట్‌కు ఒక్కో టాస్క్‌ఫోర్స్‌ను, ప్ర‌త్యేక అధికారుల‌ను కేటాయించారు.  ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 563 పాజిటివ్ కేసులు న‌మోదుఅయ్యాయి. మొత్తం 17 మంది మృతి చెందారు. తెలంగాణ‌లో సోమ‌వారం కొత్త‌గా 32 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒక‌రి మృతి చెందారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: