క‌రోనా క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్తంగా 21 రోజులుగా కొన‌సాగుతున్న లాక్‌డౌన్ గ‌డువు నేటితో ముగుస్తున్న నేప‌థ్యంలో  ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే.. రోజురోజుకూ దేశ‌వ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న నేప‌థ్యంలో మరో రెండు వారాలపాటు అంటే ఏప్రిల్ నెలాఖ‌రు వ‌ర‌కు లాక్‌డౌన్‌ పొడిగిస్తారని, ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించేందుకు లాక్‌డౌన్‌లో కొన్ని నిబంధనల సడలింపు ఉంటే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. రెడ్‌జోన్‌, ఆరెంజ్ జోన్‌, గ్రీన్ జోన్ల ఆధారంగా లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉండే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

 

ఇదిలా ఉండ‌గా.. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ తర్వాత పశ్చిమ బెంగాల్, త‌మిళ‌నాడు అరుణాచల్‌ప్రదేశ్, పుదుచ్చేరిలో లాక్‌డౌన్‌ను పొడిగించాయి. ఇదిలా ఉండ‌గా.. సోమ‌వారం రాత్రి ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా ప్ర‌ధాని మోడీకి లేఖ రాశారు. వ్య‌వ‌సాయం, దాని ఆధారిత రంగాల కార్య‌క‌లాపాల‌కు అనుమ‌తులు ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ నిర్ణ‌యం కోసం దేశ‌ప్ర‌జ‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ప్ర‌జ‌లు సామాజిక దూరం కచ్చితంగా పాటించేందుకు అనువుగా లాక్‌డౌన్‌ను పొడిగించినప్పటికీ ఆర్థిక కార్యకలాపాలను నడిపించేందుకు వీలుగా లాక్‌డౌన్‌లో కొన్ని మినహాయింపుల‌ను ప్రధాని మోడీ ప్ర‌క‌టించ‌వ‌చ్చున‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: