ప్ర‌పంచంలో వేల సంఖ్య‌లో ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోవ‌డ‌మేకాదు.. అనేక దుష్ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి అనేక దేశాలు లాక్‌డౌన్ విధించాయి. ఇక‌ భార‌త్‌లో గ‌త 21 రోజులుగా లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. అయితే.. ఇది ఏప్రిల్ 14తో ముగుస్తున్నా.. పొడిగించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అయితే.. ఈ లాక్‌డౌన్ కార‌ణంగా అనేక‌ దుష్ప‌రిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పిల్ల‌ల ప‌రిస్థితి ఆందోళ‌న‌కరంగా మారుతోంది. పిల్ల‌లు లైంగిక వేధింపులకు గుర‌వుతున్నారు. ఇక్క‌డే ఓ షాకింగ్ న్యూస్ కూడా ఉంది. లాక్‌డౌన్ స‌మ‌యంలో భార‌త్‌లో ఆన్‌లైన్ చైల్డ్ పోర్న్ ట్రాఫిక్ అమాంతంగా పెరిగిపోయింది. ఆన్‌లైన్ డాటా విశ్లేష‌ణ‌లో ఈ షాకింగ్ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. *చైల్డ్ పోర్న్*, *సెక్సీ చైల్డ్* *టీన్ సెక్స్ వీడియోలు* కోసం విప‌రీతంగా వెతికిన‌ట్లు తేలింది. లాక్‌డౌన్ కాలంలో ఈ ట్రాఫిక్ ఏకంగా 95శాతం పెరిగిన‌ట్లు తేలడం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

 

లాక్‌డౌన్ కు ముందు ఉన్న‌ ట్రాఫిక్‌తో పోల్చితే... లాక్‌డౌన్ విధించిన త‌ర్వాత‌ భార‌త్‌లో ఒక్క‌సారిగా ట్రాఫిక్ 95శాతం పెరిగింద‌ని ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ ఫండ్ (ఐసిపిఎఫ్) తెలిపింది.  ప్రపంచంలోని అతిపెద్ద అశ్లీల వెబ్‌సైట్ పోర్న్‌హబ్ నుంచి వచ్చిన డేటా ఆధారంగా వెల్ల‌డించింది. ఐసిపిఎఫ్‌ను జనవరి 2020లో నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి కుమారుడు భువాన్ రిభు ఏర్పాటు చేశారు. *మిలియన్ల మంది పెడోఫిలీస్, చైల్డ్ రేపిస్టులు, చైల్డ్ అశ్లీల బానిసలు ఆన్‌లైన్‌లోకి వలస వచ్చారు. ఇప్పుడు పిల్లలకు ఇంటర్నెట్ ఏమాత్ర‌మూ సురక్షితం కాదు. కఠినమైన చర్యలు తీసుకోకుంటే.. పిల్లలపై లైంగిక నేరాలు భారీగా పెరిగే అవకాశం ఉంది* అని ఐసిపిఎఫ్ ప్రతినిధి నివేదా అహుజా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పిల్ల‌లు ఆన్‌లైన్‌లో ఉండ‌కుండా చూడాల‌ని సూచించింది. కాగా, 11 రోజుల్లో పిల్ల‌లపై వేధింపులు, హింస‌పై ప్ర‌భుత్వ హెల్ప‌లైన్‌కు 92వేల కాల్స్ రావ‌డం గ‌మ‌నార్హం. లాక్‌డౌన్ వ‌ల్ల పాఠ‌శాల‌ల‌ను మూసి వేయ‌డంతో పిల్ల‌ల‌పై వేధింపులు పెరిగే ప్ర‌మాదం ఉంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: