భార‌త్‌లో క‌రోనా వైర‌స్ పూర్తి నియంత్ర‌ణ‌లో ఉంద‌ని, ఇది భార‌త ప్ర‌జ‌ల విజ‌య‌మ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ అన్నారు. దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న లాక్‌డౌన్‌పై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ మంగ‌ళ‌వారం ఉద‌యం  10గంట‌ల‌కు దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. క‌రోనాపై పోరుకు మ‌ద్ద‌తుగా నిలిచిన ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మ‌న సంక‌ల్ప బ‌లాన్ని ఉప‌యోగించి పోరాడ‌డం  బాబాసాహెడ్ అంబేద్క‌ర్ మ‌న‌కు నేర్పార‌ని. ఇప్పుడు క‌రోనాపై మ‌నం సంక‌ల్ప‌బ‌లంతో పోరాడాల‌ని, అదే అంబేద్క‌ర్‌కు మ‌నం అర్పించే నిజ‌మైన‌ నివాళి అని  మెడీ అన్నారు.

 

మ‌న దేశం ఎప్పుడూ పండుగ‌లతో నిండుగా ఉంటుందని అన్నారు. అది  దేశ ప్ర‌జ‌ల కృషి వ‌ల్లే క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌లో ఉంది. లాక్‌డౌన్ సంతృప్తిక‌రంగా అమ‌ల‌వుతోంది. ఇత‌ర దేశాల‌తో పోల్చితే భార‌త్ ఎంతో ప‌క‌డ్బందీగా క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి ఎంతో కృషి చేసింద‌ని అన్నారు. ఇందు కోసం మ‌న‌దేశంలో ఒక్క కేసు కూడా లేన‌ప్పుడు విదేశాల నుంచి వ‌చ్చిన ప్ర‌తీ ఒక్క‌రిని ప‌రీక్షించామ‌ని అన్నారు.  భార‌త్‌లో 550 పాజిటివ్ కేసులు ఉన్న‌ప్పుడు ముందస్తు జాగ్ర‌త్త‌ల్లో భాగంగా 21రోజుల లౌక్‌డౌన్ అమ‌లు చేశామ‌ని అన్నారు. ఇది భార‌త ప్ర‌జ‌ల విజ‌య‌మ‌ని మోడీ అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: