దేశంలో రోజు రోజుకీ కరోనా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశంలో ఇప్పుుడు కరోరానై యుద్దం చేస్తున్నాం. ప్రతి పౌరుడూ ఒక సైనికుడిలా పోరాడుతున్నారు. మనం ఇప్పుడు కరోనాపై యుద్దం చేస్తేనే గెలుస్తామని మనోధైర్యం నింపారు.  కరోనాని తరిమికొట్టడానికి ప్రతి పౌరుడూ సమిష్టిగా పోరాటం చేయాలని కోరారు.  మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు విధించిన 21 రోజుల లాక్ డౌన్ ఈరోజుతో ముగియబోతున్న తరుణంలో లాక్ డౌన్ పై ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేశారు.   లాక్ డౌన్ విధించడం వలన కేసుల సంఖ్య మిగతా దేశాలతో పోలిస్తే తక్కువ ఉందని ప్రధాని మోడీ తెలిపారు.  

 

మిగతా దేశాల కంటే మనం 20 నుంచి 30శాతం తక్కువగా ఉన్నాయని, మనం సేఫ్ జోన్ లో ఉన్నామని మోడీ తెలిపారు.  అయితే, ఈ సమయంలో లాక్ డౌన్ ఎత్తివేయడం కుదరని పని అని చెప్పిన మోడీ లాక్ డౌన్ ను మరో 19 రోజులపాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.  మే 3 వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు తెలిపారు.  కరోనా హాట్ స్పాట్ లేని ప్రాంతాల్లో కొన్ని సడలింపులు ఉంటాయని తెలిపారు.  కష్టమైనా, నష్టమైనా రాజ్యాంగంలో వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్న పదానికి ప్రజలు సంపూర్త నిదర్శనంగా నిలుస్తున్నారని ఆయన కొనియాడారు.

 

భారత్ అంటేనే భిన్నసంస్కృతులు, మతాలు, ఉత్సవాలు అని తెలిపారు.  సీనియర్ సిటిజన్స్ జాగ్రత్తగా ఉండాలి.. మాస్క్ లు ధరించాలి సోషల్ డిస్టెన్సింగ్ ఖచ్చితంగా పాటించాలి. నిరుపేదలకు అండగా ఉండాలి.. లాక్ డౌన్ పై రేపు గైడ్ లైన్ విడుదల చేస్తామని ప్రధాని తెలిపారు.  సహృదయంతో అందరూ అర్థం చేసుకొని కరోనాపై సంపూర్ణ యుద్దం చేస్తారని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: