ఏపీలో కరోనా వైరస్ క్ర‌మంగా విస్త‌రిస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది.  ప్రజలు మ‌రింత అప్రమత్తంగా ఉండాలని, సామాజిక దూరం పాటించాల‌ని ప్రభుత్వాలు హె చ్చరిస్తూనే ఉన్నాయి. అయినా  కొంత మంది ఆదేశాలను ఏ మాత్రం లెక్క చేయడంలేదు. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఓ వ్యక్తి నేరుగా కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని కలవడంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకా శం జిల్లా చీరాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

 

జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల గుండె పోటు రావడంతో అతన్ని గుంటూరులోని  ఓ ప్రైవేటు ద‌వాఖాన‌లో చేర్పించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అతడికి కరోనా ఉందని ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్నారు. ఈ సమయంలో అతడి వెంట అల్లుడి కొడుకు కూడా ఆస్పత్రిలోనే ఉన్నాడు. బాధితుడి అల్లుడు ఇటీవల ఆస్పత్రికి వచ్చి తన కొడుకును తీసుకెళ్లాడు. కరోనా వచ్చిన వ్యక్తి వద్ద ఉన్నాడనే విషయం దాచి లాక్‌డౌన్‌ నిబంధనలు ఉ ల్లంఘించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని వివిధ‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ముందు జాగ్రత్తగా ఆ కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు పంపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: