దేశంలో కరోనా త్వరిత గతిప ప్రబలిపోతుందని ఓ వైపు కేంద్ర రాష్ట్రాలు చెబుతున్నా.. కొంత మంది నిర్లక్ష్యం ఈ వ్యాధి వ్యాప్తికి దోహద పడుతుంది.  కరోనాని కట్టడి చేయడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ లో కొంత మంది కరోనా లక్షణాలు ఉన్నవారు చేస్తున్న నిర్లక్ష్యానికి.. ఉల్లంఘనకు చెక్ పెట్టబోతుంది ప్రభుత్వం. వైరస్ సోకిన వారికి ప్రభుత్వమే మెరుగైన చికిత్స అందిస్తోంది. వైరస్ అనుమానితులను తమ ఇళ్లు, క్వారంటైన్ సెంటర్లలో ఉంచి పర్యవేక్షిస్తోంది. కానీ, కొంత మంది రోగులు, అనుమనితులు వైద్యులు, అధికారులకు అస్సలు సహకరించడం లేదు. ఆసుపత్రుల్లో కొందరు వైద్య సిబ్బందిపైనే దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. 

 

మరికొంత మంది దారుణంగా క్వారంటైన్ లో నుంచి పారిపోవడం జరిగింది.  దాంతో కరోనా రోగులపై రాష్ట్ర  వైద్య ఆరోగ్యశాఖ నిఘా పెంచింది. టెక్నాలజీ సాయంతో హాస్పిటల్‌లో వాళ్ల ప్రతి కదలికనూ గుర్తిస్తోంది. వైరస్ బారిన పడిన వ్యక్తుల ఫోన్లలో ప్రత్యేకంగా రూపొందించిన మానిటరింగ్ యాప్‌ ను అధికారులు ఇన్‌స్టాల్ చేస్తున్నారు.  ఇప్పటికే 30శాతం మంది బాధితుల ఫోన్లలో యాప్ ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు.  రోగి పేరు, ఐడీ, బెడ్ నంబర్‌‌,  వార్డు నంబర్ అన్నీ అందులో అప్‌లోడ్ చేస్తారు.

 

బెడ్ ఉన్న వార్డు లొకేషన్‌ను  కూడా ట్యాగ్‌ చేస్తారు. దాంతో రోగి వార్డు నుంచి ఎక్కడికి కదిలినా... ఈ యాప్ యాక్టీవ్ అవుతుంది.. వార్డు దాటి బయటకు వెళ్తే అలర్ట్‌  వస్తుంది. ఫోన్ కదిలే ప్రతి మీటర్‌‌నూ ఈ యాప్‌ లెక్కిస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా  కూడా వెంటనే సంబంధిత హాస్పిటల్ సూపరింటెండెంట్‌కు, పోలీస్ అధికారులకు అలర్ట్ వెళ్తుంది. తద్వారా వైద్యులు, అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: