కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌పై కేంద్ర ఏకీకృత మార్గ‌ద‌ర్శ‌కాలు రిలీజ్ చేసింది. అన్ని కేంద్ర ప్ర‌భుత్వ కార్యాల‌యాలు మూసివేస్తారు. అయితే ర‌క్ష‌ణ‌, సాయుధ బ‌ల‌గాలు, విద్యుత్‌, పోస్టాఫీసులు, విప‌త్తులు నిర్వ‌హ‌ణ‌, ముంద‌స్తు హెచ్చ‌రిక‌లు.. ఆర్బీఐ గుర్తింపు ఉన్న ఆర్థిక సంస్థ‌ల‌కు పూర్తి మిన‌హాయింపు ఉంటుంది. ఇక రాష్ట్రాల్లో పోలీసులు, అత్యవసర సేవలు, జిల్లా యంత్రాంగం, ట్రెజరీ, విద్యుత్, నీరు, పారిశుద్ధ్యం, మున్సిపాలిటీలు మినహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో లాక్‌డౌన్ అమలు ఉంటుంది. 

 

అట‌వీ, సాంఘిక సంక్షేమం, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ విభాగాలు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమీటీల నేతృత్వంలోని మండీలు తదితర సేవలకు కూడా లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. కోల్డ్ స్టోరేజిలు, వేర్‌హౌస్ సర్వీసులు, నిత్యావసరాల రవాణా తదితర సేవలకు కూడా లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉంటుంది. ఇక వైద్య‌శాఖ‌కు సంబంధించి అన్నింటికి మిన‌హాయింపు ఉంటుంది. అలాగే అన్ని ఫ్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియాలు, స‌మాచార శాఖ‌లు ప‌నిచేస్తాయి. 

 

ఇక పారిశ్రామిక సంస్థలు, ప్రజా రవాణా సర్వీసులు, హోటళ్లు, రెస్టారెంట్లు, విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాలు, ఫంక్షన్లపై లాక్‌డౌన్ సమయంలో నిషేధం ఉంటుంది. ఫిబ్రవరి 15 తర్వాత భారత్‌కు తిరిగి వచ్చిన విదేశీయులకు క్వారంటైన్‌ నిబంధనలను కఠినంగా కొనసాగిస్తారు. ఇక సోష‌ల్ డిస్టెన్స్ పై కంట్రోల్ ఉంటుంది. జిల్లా యంత్రాంగాలు ఈ బాధ్యత తీసుకోవాలని ఆదేశించింది. ఇదిలావుంటే, లాక్‌డౌన్‌ నిబంధనలపై కేంద్రం బుధవారం పూర్తిస్థాయి మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్టు ప్రధాని మోదీ పేర్కొన్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: