క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్తంగా మే 3వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగించిన విష‌యం తెలిసిందే. భార‌త్‌లో కొవిడ్‌-19 నియంత్ర‌ణ‌లో ఉంద‌ని, ప్ర‌జ‌లు ఇదే స్ఫూర్తితో వ‌చ్చే 19రోజులూ స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. అయితే.. ఇక్క‌డ మ‌రికొన్ని విష‌యాల‌ను కూడా ప్ర‌స్తావించారు. ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి అత్యవసర విషయాలకు అనుమతులు ఉంటాయని తెలిపారు. అయితే.. ఈక్ర‌మంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ముందు ఇచ్చిన అనుమతులను వెనక్కి తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పుడు మ‌నం ఎలాంటి నిర్లక్ష్యం వహించే పరిస్థితి లేదని... మే 3వ తేదీ వరకు ప్రతీ పౌరుడు సహకరించాలని ఆయ‌న కోరారు.

 

ఇక ఇప్ప‌టి నుంచి ఒక్కరు కూడా కొత్తగా కరోనా బారిన పడకూడదన్నదే త‌మ ల‌క్ష్య‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద పేద‌ల‌కు తగినంత సాయం అందిస్తున్నామ‌ని. అహార వస్తువులు మందులు, ఔషధాల స‌ర‌ఫ‌రాను నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. నిత్యవసరాల సప్లయ్‌ చైన్‌కు ఎలాంటి అవరోధం కలగకుండా చర్యలు తీసుకుంటామ‌ని మోడీ వెల్ల‌డించారు.  దేశంలో పేదలు, కూలీలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని ఆయ‌న ఒప్పుకున్నారు. అయితే.. ఈ నెల 20 నుంచి ఇవ్వాల్సిన అనుమ‌తులు, నిత్యావ‌స‌రాల స‌ర‌ఫ‌రా త‌దిత‌ర కీల‌క అంశాల‌పై చ‌ర్చించేందుకు బుధ‌వారం సాయంత్రం 5.30గంట‌ల‌కు కేంద్ర మంత్రివ‌ర్గం స‌మావేశం కానుంది. ఈ స‌మావేశం అనంత‌రం లాక్‌డౌన్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను వెల్ల‌డించే అవ‌కాశం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: