ఇది నిజంగా మీరు న‌మ్మ‌లేని నిజం.. అయినా.. న‌మ్మితీరాల్సిందే..! ఆ దేశాల్లో క‌రోనా మ‌హ‌మ్మారి జాడేలేదు. ఇంత‌వ‌ర‌కూ ఆ దేశాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా న‌మోదు కాలేదు. ఏమిటీ.. ఆశ్చ‌ర్యంగా ఉంది క‌దూ.. ! అవును ఆశ్చ‌ర్యంగానే ఉంటుంది మ‌రి. ప్ర‌పంచాన్ని క‌రోనా చుట్టేసింద‌ని.. జ‌నం పిట్ట‌ల్లా రాలిపోతున్నార‌ని నిత్యం బ్రేకింగ్ చూస్తున్న మ‌న‌కు.. అస‌లు క‌రోనా జాడ‌లేని దేశాలు కూడా ఉన్నాయంటే న‌మ్మ‌డం కాస్త క‌ష్ట‌మే మ‌రి. అగ్ర‌రాజ్యాలు సైతం చిగురుటాకులా వ‌ణికిపోతున్న వేళ‌.. దేశాలకు దేశాలు వేలు, ల‌క్ష‌ల్లో ప్రాణాలు కోల్పోతున్న దారుణ ప‌రిస్థితుల్లో.. క‌రోనా కేసులే లేని దేశాలు కూడా ఉన్నాయా..? అంటూ నోరెళ్ల‌బెట్ట‌కండి..! ఉన్నాయి మ‌రి.

 

అయితే.. ఇంత‌కీ ఆ దేశాలు ఏమిట‌ని అనుకుంటున్నారా..?  కాస్త ఓపిక‌ప‌ట్టండి... ఇక అక్క‌డికే వ‌ద్దాం.. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం జాన్ హాప్‌కిన్స్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. ఆ దేశాలు ఇవే.. కొమొరోస్, లెసోతో, మార్షల్ దీవులు, పలావు, నౌరు, సమోవ, కిరిబాటి, వనౌటు, సోలమన్ దీవులు, టోన్గా, టువాలు, తుర్క్మెమెనిస్థాన్‌, తజికిస్తాన్ దేశాల్లో క‌రోనా జాడే లేద‌ని ఆ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైంది. ఇక ఈ దేశాల్లో ప్ర‌జ‌లు ఎప్ప‌టిలాగే.. ఎలాంటి ఆంక్ష‌లు లేకుండా హాయిగా గ‌డుపుతున్నారు. ఎంత అదృష్ట‌వంతులో వీళ్లు..!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: