తెలుగు రాష్ట్రాల్లో కరోనా ని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఏపిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి లాక్ డౌన్ పై సడలింపు చేయాలని మోదీని కోరిన విషయం తెలిసిందే.  డేంజర్ జోన్లు మినహా మిగతా చోట్ల షరతులతో లాక్ డౌన్ ని సడలించాలని చెప్పిన విషయం తెలిసిందే.  తాజాగా లాక్ డౌన్ నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తే అరవై శాతం ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోగల్గుతామని  ఏపీ సీఎం జగన్ అన్నారు.   

 

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన మాట్లాడారు. ఇప్పుడు కరోనా పరిస్థితి నేపథ్యంలో అన్నీ స్థంబించిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులు ఎలాంటి కష్టాలు పడరాదని.. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు అవకాశాలు కల్పించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని, మద్దతు ధర కన్నా తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి ఉండకూడదని కలెక్టర్లను ఆదేశించారు.

 

రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్ అత్యంత ప్రాధాన్యతా అంశాలని, ఇవి జూన్ నుంచి   పనిచేయాలని ఆదేశించారు.  దేశంలో  రోజు రోజుకీ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ అవుతుంది.. కేసులు పెరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది మరింత అలర్ట్ గా ఉండాలని.. కరోనా లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రజలను కోరారు.  

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: