తెలంగాణలో కరోనాని ఎంత కట్టడి చేయాలని చూస్తున్న ఎక్కడో అక్కడ రోజూ  ఈ కేసులు వెలుగు చూస్తేనే ఉన్నాయి. తాజాగా గాంధీ హాస్పిటల్ లో మరో కరోనా పాజిటీవ్ కేసు గుర్తించారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో లోకల్ ట్రాన్స్ మిషన్ ద్వారా  ఓ మహిళలకు కరోనా? గత మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ.  అయితే మహిళకు ట్రావెల్ హిస్టరీ లేదు, కరోనా వచ్చిన వ్యక్తితో కాంటాక్ట్ లేదు. రెండు, మూడు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన బాధితురాలు.  కాగా, సోమ‌వారం తెలంగాణ వ్యాప్తంగా 61 నూత‌న కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వ‌చ్చాయి.

new corona positive cases in telangana

అలాగే ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఒక‌రు మ‌ర‌ణించారు.దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 592కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 472 ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.  ఇక మొత్తం చికిత్స పొందుతున్న వారిలో సోమ‌వారం ఒక్క‌రు కూడా డిశ్చార్జి కాలేదు.ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకుని, డిశ్చార్జ్‌ చేసిన అయిన వారి సంఖ్య 103గా ఉంది. 

 

మ‌రోవైపు ఎక్కువ కేసులు హైద‌రాబాద్ జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే న‌మోదువుతున్నాయని ప్ర‌భుత్వం తెలిపింది. హైద‌రాబాద్ జిల్లాపై ఎక్కువ ఫోకస్ పెడుతున్న‌ట్లు పేర్కొంది.  ఇక ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 472 మంది ఉన్నారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: