కరోనా అప్డేట్: కేంద్రం నిర్ణయాన్నిశిరసావహిస్తాం..మంత్రి బొత్స!!

ఈరోజు దేశప్రజలనుద్దేశించి దేశ ప్రధాని కొన్ని మార్గ దర్శకాలను సూచించారు. ఇందులో భాగంగా కరోనా కట్టడికి లాక్ డౌన్ మే 3 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయాన్ని   బలపరుస్తూ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంఘీ భావం తెలిపారు. ఈ సందర్భం గా మంత్రి  బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రధానిగారు తీసుకున్న నిర్ణయాన్ని శిరసా వహిస్తామని వెల్లడించారు మంత్రి బొత్స. అదేవిధంగా సాధారణ ప్రజానీకానికి ఇబ్బంది కలుగకుండా చూసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసారు. అదేవిధంగా వరి.జొన్నలు ,పప్పు ధాన్యాలు ,మిర్చి , పత్తి మొదలగు పంటలను నేరుగా ఇంటివద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు .

అదేవిధంగా పండ్లు కూరగాయలు అమ్ముకొనే విధంగా మార్కెట్ చేసుకొనే ఫెసిలిటి కల్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అన్ని పంటలను ప్రోత్సహిస్తామని తెలిపారు, అదేవిధంగా ఆక్వా ఉత్పత్తులను కూడా మార్కెటింగ్ కు అనుమతిస్తామని చెప్పారు , వైస్సార్ జనతా బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.  ఇప్పటివరకు రేషన్ బియ్యం తో పాటు వెయ్యి రూపాయల చొప్పున ఒక్కొక్కరికి అందించామని ఈ సందర్భంగా తెలిపారు అదేవిధంగా ఈ ఫలాలు ప్రతి ఒక్కరికి అందింది లేనిది తెలుసుని తగు చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలియజేసారు .

 

1000 రూ ఎవరికైతే అందలేదో వారికీ కచ్చితంగా అందేవిధంగా ఆజ్ఞలు జారీ చేస్తున్నట్లు చెప్పారు.   మోడీగారు సూచించిన లక్డౌన్ ను హృదయపూర్వకంగా వైఎస్ జగన్ స్వీకరించారని తేలియజేశారు. కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసిన వారికీ కూడా రేషన్ అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. లాక్ డౌన్ లో ఉన్న అన్ని ప్రాంతాలకు నిత్యావసరాలను ఇంటికే పంపిణి చేస్తాము. ఇప్పటివరకు గుంటూరులో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు జరిగాయి...ఇవాళ కొత్తగా కొత్త 17 కరోనా కేసులు ఏపీ లో  నమోదు అయ్యాయి . లాక్ డౌన్ ప్రాంతాలను కట్టుదిట్టం చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఫీజ్ రియంబర్స్ మెంట్ నేరుగా విద్యార్థి తల్లి ఖాతాలో చెల్లిస్తున్నట్లు తెలిపారారు . వచ్చే సంవత్సరం నూతన విద్య విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు మంత్రి తెలియజేసారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: