మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు విధించిన 21 రోజుల లాక్ డౌన్ ఈరోజుతో ముగియబోతున్న తరుణంలో లాక్ డౌన్ పై ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేశారు.లాక్ డౌన్ విధించడం వలన కేసుల సంఖ్య మిగతా దేశాలతో పోలిస్తే తక్కువ ఉందని ప్రధాని మోడీ తెలిపారు.  మిగతా దేశాల కంటే మనం 20 నుంచి 30శాతం తక్కువగా ఉన్నాయని, మనం సేఫ్ జోన్ లో ఉన్నామని మోడీ తెలిపారు.  మే 3 వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు తెలిపారు.  ఏప్రిల్ 20 వ తేదీ వరకు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తామని మోడీ తెలిపారు.  ఏప్రిల్ 20 తరువాత కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొంత సడలింపులు విధించే అవకాశం ఉన్నట్టుగా మోడీ ఈ సందర్భంగా తెలిపారు. 

 


- వైద్య సేవలకు తప్ప పక్క రాష్ట్రాలకు అనుమతి నిరాకరణ

 

- నిర్దేశిత పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి

 

- రైళ్లు, బస్సులు, విమానాలు, మెట్రో రైళ్లు బంద్

 

- ఏప్రిల్ 20 నుంచి వ్యవసాయ ఉత్పతుల సేకరణ, మండీలకు అనుమతి

 

- నిత్యావసరాల పంపిణీ మినహా ఎలాంటి కార్యకలాపాలు ఉండవు

 

- వాహనాలు, కార్మికులు విధిలు నిర్వహించే సామాగ్రిని ఎప్పటికప్పడు శానిటైజేషన్ చేయాలి

 

- విధులు నిర్వహించే వారికి మెడికల్ ఇన్స్యూరెన్స్ తప్పనిసరి

 

- ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లలో శానిటైజర్ తప్పని సరిగా ఉండాలి

 

- ఏప్రిల్ 20 తర్వాత హాట్ స్పాట్లు కాని ప్రాంతాల్లో పరిమితమైన లాక్ డౌన్ సడలింపు

 

- ఆన్ లైన్ షాపింగ్, ఈ కామర్స్ అనుమతిచ్చిన కేంద్రం

 

- ప్రజలు బయటకు వచ్చినపుడు ఫేస్ మాస్క్ లు తప్పనిసరి

 

- హాట్ స్పాట్ లలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలి

 

- 30 నుంచి 40 శాతం మంది మాత్రమే ప్రయాణించాలని సూచనలు

 

- సోషల్ డిస్టెన్స్ అమలుకు వీలుగా ఉద్యోగులు ఫిఫ్ట్ లు మారే సమయంలో గంట విమారం

 

- పది అంతకన్నా ఎక్కువ మంది ఒక చోట గుమి కూడడంపై నిషేదం

 

- కార్యాలయాల్లో ఒకరికొకరు కనీసం ఆరడుగుల దూరం పాటించాలి

 

- లిఫ్ట్ లో ఇద్దరు కంటే ఎక్కువ మంది ఎక్కొద్దని సూచన

 

- లిక్కర్, గుట్కా, పొగాకు అమ్మకాలపై కొనసాగుతున్న నిషేదం

 

- మే 3 వరకు రాష్ట్రాల మద్య అన్ని రకాల రవాణాలు బంద్

 

- హాట్ స్పాట్ లలో జనసంచారం ఉండకూడదు

 

- హాట్ స్పాట్ లలో కఠిన నిబంధనలు

 

- ఆన్ లైన్ షాపింగ, ఈ కామర్స్ కు అనుమతి

 

- మత ప్రార్ధనలు, దైవ కార్యక్రమాలు నిషేదం

 

- ఆటో , ట్యాక్సీలు బంద్

 

- సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, జిమ్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ బంద్

 

- స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్ టైన్ మెంట్ పార్కులు బంద్

 

- అన్ని రకాల సమావేశాలు, సభలు నిషేదం, స్పోర్ట్స్ ఈవెంట్స్ బంద్

 

- అంత్యక్రియలకు హాజరయ్యేందుకు 20 మంది వరకు అనుమతి

 

- వారికి కూడా ముందే అనుమతి తీసుకోవాలి

 

- బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదు, ఉమ్మి వేస్తే జరిమానా తప్పదు

మరింత సమాచారం తెలుసుకోండి: