కంటికి క‌నిపించ‌ని శత్ర‌వుతో దేశం యుద్ధం చేస్తోంది.  కరోనా వైరస్ పై పోరులో డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా వాళ్లు శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తున్నారు.  కొంత మంది అధికారులు సైతం నిస్వార్థ సేవలు అందిస్తున్నారు. భార్యా పిల్ల‌ల‌కు దూరంగా, సంతోషాలకు, వి షాదాలకూ అతీతంగా విధులకే పరిమితమవుతున్నారు.  తమ కర్తవ్యాన్ని చాటుకుంటూ ప‌లువురికి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. ఏపీలో ఇలాంటి అ ధికారులు కొంద‌రు నిబ‌ద్ధ‌త‌తో త‌మ వృత్తికే వ‌న్నె తెస్తున్నారు. 

 

ఇటీవ‌ల విజయవాడ ఎస్ఐ శాంతారామ్ కన్నతల్లి చనిపోయినా దు:ఖాన్ని దిగమింగుకుని విధులు నిర్వర్తించారు. మాతృమూర్తి చనిపోయిన విషా దంలోనూ విధులకు హాజరై కర్తవ్యాన్ని నిర్వర్తించారు. విశాఖపట్నం నగర మున్సిపల్ కమిషనర్ గుమ్మళ్ల సృజన కూడా తన కమిట్‌మెంట్‌ను చాటు కున్నారు. ప్రసూతి సెలవులకు అవకాశం ఉన్నా..  నవజాత శిశువును పొత్తిళ్లల్లో పెట్టుకుని విధులు నిర్వర్తిస్తున్నారు.  తాజాగా కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ ఎండీ ఇంతియాజ్ తన సొంత మామను పోగొట్టుకున్న విషాదంలోనూ విధులు నిర్వర్తించి వృత్తి ధ‌ర్మాన్ని కాపాడారు.  అయితే  యాధృచ్చికంగా ఈ ముగ్గురు అధికారులు ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారే కావడం గమనార్హం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: