రెజీనా... అంటే తెలియని టాలీవుడ్ ప్రేక్షకుడు ఉండడు. తెలుగులో అనుకున్నంత విజయాలు అందుకోకపోయినప్పటికీ,  అమ్మడు తన అందంతో కుర్రాళ్లను బాగానే ఎట్రాక్ట్ చేసింది. ఈ మధ్య కాలంలో సినిమా కెరీర్ పై కాస్త ఎక్కువ దృష్టి పెట్టింది. ప్రస్తుతం కొంచెం రొటీన్ కి భిన్నంగా అడుగులు వేస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు గత కొన్ని రోజులుగా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజీనా కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. 

 

గ్లామర్ గర్ల్ గా కనిపించడానికి త‌న‌కు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. అంతేగాక హీరోయిన్ పాత్ర ఘాటుగా.. బ్యాడ్ గర్ల్ లా ఉన్నా పరవలేదని.. బోల్డ్ పాత్రలు చేయాలని ఉందని వివరణ ఇచ్చింది. రెజీనా ఆ మధ్య ఒక యువ హీరోతో రొమాంటిక్ సినిమాలు చేస్తుండడం ఇంటర్నెట్ వరల్డ్ లో వైరల్ అయ్యింది. ఆమె అతనితో డేటింగ్ లో ఉందని లవ్ రూమర్స్ వచ్చాయి. అయితే రెజీనా ఆ రూమర్స్ పై చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: