లాక్‌డౌన్‌తో ముహూర్తాలు మూలకు చేరాయి. వివాహ తంతు వాయిదా పడింది. కల్యాణ మంటపాలు కళతప్పాయి. ఫంక్షన్‌ హాళ్లు వెలవెలబోయాయి. పురోహితుడి నుంచి బ్యాండ్‌ వాద్యకారుల దాకా అన్ని వృత్తులపై తీవ్ర ప్రభావం చూపింది క‌రోనా...  బంగారు ఆభరణాలు, బట్టల అమ్మకాలు, వెండి వస్తువులు, వంటింటి సామ‌గ్రి, ఫర్నీచర్‌ వంటి అనేక రకాల వస్తువులు  ఈ సీజన్‌లోనే ఎక్కువగా అమ్ముడవుతాయి. అలాంటి పెళ్లిళ్ల సీజన్‌ను కరోనా కాటేసింది. లాక్‌డౌన్‌ బ్రేక్‌ పడింది. 

 

ఈ పెళ్లిల సీజ‌న్‌లో దేశ‌వ్యాప్తంగా కొన్ని వంద‌ల కోట్ల మేర‌కు న‌ష్టం వాటిల్లింద‌ని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఒక్క  గ్రేటర్‌ పరిధిలోని సుమారు 5 వేలకు పైగా చిన్నవి. పెద్దవి ఫంక్షన్‌హాళ్లు, కన్వెన్షన్‌ సెంటర్లు, పెళ్లి మండపాలు ఎలాంటి కళా కాంతులు లేకుండా వెలవెలాపోతున్నాయి. కేటరింగ్‌ సర్వీసుల్లో, బ్యాండ్‌ మేళ్లాల్లో పని చేసే సిబ్బంది, కళాకారులు ఉపాధిని కోల్పోయారు. సుమారు 2 లక్షల మంది ఉపా ధిపైన మహమ్మారి కరోనా వేటేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: