లాక్‌డౌన్ నేప‌థ్యంలో పోలీసులు రాత్రి, పగలు తేడా లేకుండా విధుల్లో బిజీగా ఉన్నారు. జనాలు రోడ్లపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని సూచిస్తున్నారు. పోలీసులతో పాటూ పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు, న‌ర్సులు చేస్తున్న సేవలకు జనాలు ప్రశంస లు కురిపిస్తున్నారు. వారిపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.

 

తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి తూర్పుగోదావరి జిల్లా తునిలో అలాంటి జరిగింది.  ఎండను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసుల్ని చూసి ఓ పేద మహిళ చలించిపోయింది. వారికి తన వంతుగా ఏదైనా సేవ చేయాలని భావించింది.. రెండు పెద్ద కూల్‌డ్రింక్స్ బాటిల్స్ తీసుకొచ్చి, పోలీ సులకు అందించింది. ఆమె చేసిన పనికి పోలీసులు ముగ్దుల‌య్యారు.. ఆమె వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాను కూలి పనికి పోతుంటానని.. నె లకు రూ.3,500 జీతం వస్తుందని మహిళ చెప్పింది. ఆమె మాటలు విన్న పోలీసులు.. ఆ రెండు కూల్ డ్రింక్ బాటిళ్లు వెనక్కు ఇచ్చి.. తమ దగ్గర ఉన్న కూల్ డ్రింక్ బాటిళ్లను ఇచ్చారు.. పిల్లలకు ఇవ్వమని చెప్పారు. 'నువ్వు నిజంగా మహాతల్లివమ్మా' అంటూ పోలీసులు ప్రశసించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: