మే 3 వరకు లాక్‌డౌన్ కొనసాగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. అప్పటి వరకూ అన్ని రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ఇప్ప‌టి వ‌రుకు బుక్ చేసుకున్న 39 ల‌క్ష‌ల టికెట్లు ర‌ద్ద‌యిన‌ట్లు అధికారుల తెలిపారు.  ఈ క్రమంలో మే 3 వరకు రద్దైన అన్ని రైళ్లకు టికెట్ బుకింగ్స్ చార్జీలను రీఫండ్ చేస్తామని భారత రైల్వే శాఖ ప్రకటించింది. 

 

ఆన్‌లైన్ కస్టమర్లకు ఆటోమేటిగ్గా రీఫండ్ చేస్తామని వెల్లడించింది. మరోవైపు జూలై 31 వరకు కౌంటర్ల వద్ద టికెట్లు బుక్ చేసుకున్నవారు రీఫండ్ సొమ్ము తీసుకోవచ్చునని స్పష్టంచేసింది. రద్దు కాని రైళ్లలో అడ్వాన్స్ బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకున్న కస్టమర్లకు సైతం పూర్తిగా రీఫండ్ చేయనున్నట్టు రైల్వే శాఖ పేర్కొంది.  తదుపరి కేంద్రం నుంచి ఆదేశాలు వెలువడే వరకు ఈ-టికెట్లు సహా అడ్వాన్స్ రిజర్వేషన్లు అనుమతించబోమని రైల్వే శాఖ చెప్పింది. అ యితే ఆన్‌లైన్ క్యాన్సిలేషన్ సేవలు మాత్రం యధాతథంగా కొనసాగుతుందని అధికారులు వెల్ల‌డించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: