లాక్ డౌన్ నేపథ్యంలో యాత్రలకు మరియు పక్కరాష్ట్రాలకు వలస వెళ్లిన జనాలు ఇంటికిరావడానికి నానా అగచాట్లు పడుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని రాజమెండ్రి భక్తులు మార్చి 22 న యూపీ లోని మధుర జిల్లాలోని బృందావనంలో చిక్కుకున్నారు. అయితే వీరంతా కూడా కాశీ దర్శనార్ధం కాశివెళ్లి వస్తున్నారు.ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుకున్నారు. మొదట ఏప్రిల్ 14 వరకు గడువు ఉండగా మోడీగారు నిన్న జరిగిన మీడియా సమావేశంలో మే 3 వరకు ప్రకటించిన విషయం తెలిసిందే .

 

అయితే ఇప్పటివరకు యూపీలో చిక్కుకున్న భక్తులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వారికి సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదివరకే తమను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు .యూపీ ప్రభుత్వం కూడా దీనికి సహకరిస్తామని తెలియజేసింది. కానీ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం వీరిపై జాలి చూపించక పోవడంతో నిరాశకు గురవుతున్నారు. ఓపక్క మమ్మల్ని మా సొంత గ్రామానికి తీసుకువెళ్ళమని చేతులెత్తి వేడుకుంటున్నారు . మరి ఇకనైనా ప్రభుత్వం స్పందిస్తుందోలేదో వేచి చూడాలి . 

మరింత సమాచారం తెలుసుకోండి: