ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మహేంద్ర లాజిస్టిక్స్ లిమిటెడ్ ముందుకొచ్చింది. సీనియర్‌ సిటిజన్స్‌, ఒంటరి తల్లులు, దివ్యాంగులకు అత్యవసర పరిస్థితుల్లో ఉచిత రవాణా సేవలు చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తుంది. ఈ అలైట్ క్యాబ్ సర్వీసులను కమిషనరేట్‌ కార్యాలయం వద్ద సీపీ అంజనీకుమార్‌ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు, సంబంధిత సామగ్రి, పోస్టాఫీసులు, మందులు, నిత్యావసర వస్తువులు, మందులు పంపిణీ చేసే వలంటీర్లు, హెల్త్‌ వర్కర్స్‌ కు ఈ క్యాబ్‌లు ఉచితంగా సేవలు అందిస్తాయన్నారు.

 

24 గంటల పాటు ఈ క్యాబ్ లు అందుటబాటులో ఉండి సేవలు అందిస్తాయని తెలిపారు. నగరంలో ప్రస్తుతం 10 క్యాబ్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చామని, అత్యవసరంగా బయటికి వెళ్లాలనుకునే వారు ఈ క్యాబ్ సర్వీసులను వినియోగించుకోవాలని కోరారు.  ఈ క్యాబ్‌ సర్వీసులను పొందాలనుకునేవారు 8433958158 నంబర్‌ కు కాల్ చేసి సంప్రదించాలని తెలిపారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: