క‌రోనాపై పోరాటానికి సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్ బుక్ ముందుకువ‌చ్చింది.  కోవిడ్ -19పై ప్రజలకు ఆవగాహన కల్పించేందుకు డబ్ల్యూహెచ్‌వోతో కలసి చాట్‌బాట్‌ను ప్రారంభించింది.  ఫేస్‌బుక్ మెసెంజర్ చాట్‌బాట్ లో కరోనా వైరస్ కు సంబంధించిన సమగ్ర వివరాలు అందిస్తారు. వాట్సాప్ తరువాత, పేస్ బుక్ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ భాగస్వామ్యంతో కోవిడ్ -19 చాట్ బాట్ ను ఆవిష్కరించింది. 

 

పేస్ బుక్ మెసెంజర్ కు నెలవారీ 1.3 బిలియన్లకు పైగా యాక్టివ్ వినియోగదారులు ఉన్నారు. డబ్ల్యూహెచ్‌ఓ కు చెందిన హెల్త్ అలర్ట్ ఇంటరాక్టివ్ సర్వీస్ ను పేస్ బుక్ లోని డబ్ల్యూహెచ్‌వో అధికారిక పేజీ నుండి యాక్సెస్ చేయవచ్చు. ఆ పేజీలో ఉన్న మెసెంజర్ చిహ్నాన్ని టచ్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌ఓ కోవిడ్ -19 చాట్‌బాట్ ఇంగ్లీష్, స్పానిష్, అరబిక్ భాషలలో అందుబాటులో ఉంది. ఇది త్వరలో మరిన్ని భాషలలో అందుబాటులోకి రానుంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: