హైద‌రాబాద్ నాంప‌ల్లిలో అఖిల‌ప‌క్ష నాయ‌కులు స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌మావేశానికి టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ నేత హ‌నుమంత‌రావు, తెలంగాణ జ‌న స‌మితి నేత కోదండ‌రాం, తెలుగు దేశం నంచి ఎల్ ర‌మ‌ణ‌, సీపీఐ నేత చాడ వెంక‌ట‌రెడ్డి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.  తాజాగా తెలంగాణ‌లో నెల‌కొన్న ప‌రిస్థితులపై ఈ స‌మావేశంలో చ‌ర్చిస్తున్నారు. ఇందులో ప్ర‌ధానంగా క‌రోనా వైర‌స్‌తో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. క‌రోనా క‌ట్ట‌డికి టీఆర్ఎస్ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై చ‌ర్చిస్తున్నారు.

 

రాష్ట్ర ప్ర‌భుత్వానికి స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌నున్నారు. ఇదిలా ఉండ‌గా.. అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని ఆయ‌న విగ్ర‌హానికి హ‌నుమంత‌రావు పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. దీంతో ఎలాంటి అనుమ‌తులు తీసుకోలేదంటూ హ‌నుమంత‌రావుపై పోలీసులు కేసు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. ఈ అంశంపై కూడా స‌మావేశంలో చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. ఈ నేత‌లు ఇచ్చే స‌ల‌హాలు, సూచ‌న‌ల‌పై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి మ‌రి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: