కోవిడ్ -19 ప్ర‌పంచాన్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కంటికి క‌నిపించ‌ని ఈ మ‌హ‌మ్మారితో యావ‌త్ మాన‌వ‌జాతి యుద్ధం చేస్తోంది.  క‌రోనా వైర‌స్ లక్ష‌ల్లో ప్రాణాల‌ను హ‌రిస్తూ ప్ర‌పంచ దేశాల‌ను హ‌డ‌లెత్తిస్తోంది. అయితే ఇది కూడా సాధార‌ణ జ‌బ్బులాంటిదేన‌ని, ధైర్యంతో దీన్ని జ‌యించ‌వ‌చ్చని తొంభై తొమ్మిదేళ్ల వృద్ధుడు నిరూపించాడు. ఈ అద్భుత ఘ‌ట‌న బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. 

 

ఎర్మాండో పివేటా (99) రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో బ్రెజిల్ ఫిరంగిద‌ళంలో సేవ‌లందించాడు. ఆయ‌న మిత్ర దేశాల త‌ర‌పున పోరాటం కొన‌సాగించాడు. రెండ‌వ లెఫ్టినెంట్‌గా ప‌ని చేసిన ఆయ‌న ఈమ‌ధ్యే క‌రోనా బారిన ప‌డ్డాడు. కానీ యుద్ధాన్నే జ‌యించిన అత‌డికి క‌రోనా బెదిరిపోయింది. ఎనిమిది రోజుల చికిత్స అనంత‌రం క‌రోనా నుంచి బ‌య‌ట‌పడ్డాడు.   ఆర్మీ క్యాప్ ధ‌రించిన ఆయ‌న ఆసుప‌త్రి నుంచి బ‌య‌ట‌కు వ‌స్తుండ‌గా,  అధికారులు సెల్యూట్ చేశా రు. ఈసంద‌ర్భంగా అక్క‌డి ఆర్మీ అధికారులు స్పందిస్తూ.. అత‌ను మ‌రో యుద్ధాన్ని జ‌యించాడ‌ని కొనియాడారు. ప్ర‌స్తుతం ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: